Share News

‘క్రీడలతో మానసికోల్లాసం’

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:02 AM

క్రీడలతో శారీరక, మానసికో ల్లాసం కలుగుతుందని వెన్నెల వలస జవహర్‌ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ బి.బేతనస్వామి అన్నారు.

 ‘క్రీడలతో మానసికోల్లాసం’
వాలీబాల్‌ ఆడుతున్న క్రీడాకారులు

సరుబుజ్జిలి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో శారీరక, మానసికో ల్లాసం కలుగుతుందని వెన్నెల వలస జవహర్‌ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ బి.బేతనస్వామి అన్నారు. విద్యాలయంలో రీజనల్‌ స్థాయి వాలీబాల్‌ పోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయ కత్వ లక్షణాలు, ఆరోగ్యకరమైన పోటీతత్వం అవసరమన్నారు. అనం తరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో తెలంగాణా, కేరళ, పుదుచ్చరి, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్టాలు నుంచి 383 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ రాఘవేంద్రరావు, పీహెచ్‌ వైద్యాధికారులు సాహితీ ప్రియదర్శిని, ప్రశాంత్‌, ఉపాధ్యాయులు, కోచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 12:02 AM