Share News

సంగీతంతో మానసిక ప్రశాంతత: బగ్గు

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:20 AM

సంగీతంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.

 సంగీతంతో మానసిక ప్రశాంతత: బగ్గు
నరసన్నపేట: త్యాగరాజ ఆరాధనోత్సవాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రమణమూర్తి

నరసన్నపేట, జనవరి 7(ఆంధ్రజ్యోతి): సంగీతంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. బుధవారం స్థానిక శారద సంగీత అకాడమీలో త్యాగరాజు 179వ ఆరాధనోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బగ్గు అర్చన, రాష్ట్ర కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, వంశధార డీసీ చైర్మన్‌ శిమ్మ చంద్రశేఖర్‌, అడపా చంద్రశేఖర్‌, గొద్దు చిట్టిబాబు, సాసుపల్లి కృష్ణబాబు, కింజరాపు రామారావు, పీస కృష్ణ పాల్గొన్నారు.

మెరుగైన సేవలు లక్ష్యం

జలుమూరు, (సారవకోట) జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : మెరుగైన వైద్యసేవలందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సారవకోట మండలం బుడితిలో హోమియో ఆసుపత్రి భవన నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, కత్తిరి వెంకటరమణ, హోమియో వైద్యాధికారి అనుజ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2026 | 12:20 AM