Share News

రేపు శ్రీకాకుళంలో మెగా జాబ్‌ మేళా

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:26 PM

నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈనెల 6 (శుక్రవారం) నగరంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.సుధ ఒక ప్రకటనలో తెలిపారు.

రేపు శ్రీకాకుళంలో మెగా జాబ్‌ మేళా

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మార్చి 4(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈనెల 6 (శుక్రవారం) నగ రంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.సుధ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఆరోజు ఉదయం 10 గంటల నుంచి ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. యపిటోరియా(అరబిందో), అన్నపూర్ణ ఫైనాన్స్‌, డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ తదతర ప్రముఖ సంస్థలు 230 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తా యన్నారు. పదో తరగతి, ఇంటర్‌, ఏదైనా డిగ్రీతో పాటు, బీఎస్సీ/ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), డిప్లొమా ఇన్‌ కెమికల్‌ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు కలిగిన యువతీ యువ కులు ముందుగా తమ వివరాలను ‘డబ్లుడబ్లుడబ్లు.ఎన్‌సిఎస్‌.జీఓవీ.ఇన్‌’ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ను బట్టి నెలకు రూ.14,500 నుంచి రూ.35 వేల వరకు వేతనం లభిస్తుం దన్నారు. అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాల నకళ్లు, ఆధార్‌ కార్డుతో సహా నేరుగా హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు స్థానిక ఉపాధి కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 11:26 PM