Share News

నేడు మెడికల్‌ షాపుల బంద్‌

ABN , Publish Date - May 20 , 2026 | 12:09 AM

Medical shops closed ఆన్‌లైన్‌ ఫార్మసీ (ఇ-ఫార్మసీ) విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌(ఏఐఓసీడీ) ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపుల బంద్‌ జరగనుంది.

నేడు మెడికల్‌ షాపుల బంద్‌

  • ఇ-ఫార్మసీలకు వ్యతిరేకంగా ఏఐఓసీడీ పిలుపు

  • రోగులకు అందుబాటులో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

  • ఆందోళన చెందవద్దన్న డ్రగ్స్‌ కంట్రోల్‌ ఏడీ చంద్రరావు

  • శ్రీకాకుళం, మే 19(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ ఫార్మసీ (ఇ-ఫార్మసీ) విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌(ఏఐఓసీడీ) ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపుల బంద్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని రోగులు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మందులను అందుబాటులో ఉంచేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ(డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌) జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ చంద్రరావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ‘జిల్లాలో ఆన్‌లైన్‌ ఫార్మసీల ప్రభావం పెద్దగా లేదు. కేవలం జాతీయ సంఘం పిలుపునకు సంఘీభావంగా మాత్రమే ఈ బంద్‌ జరుగుతోంది. బంద్‌ ప్రభావం పాక్షికంగానే ఉంటుంది. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల కేంద్రాల్లో ప్రజల సౌకర్యార్థం కొన్ని ప్రధాన మెడికల్‌ షాపులను తెరిచి ఉంచేలా చర్యలు తీసుకున్నాం. మూసివేసిన ప్రతి దుకాణం వద్ద.. సమీపంలో తెరిచి ఉన్న మెడికల్‌ షాపుల వివరాలతో కూడిన పోస్టర్లను ప్రదర్శిస్తాం. అపోలో, మెడ్‌ప్లస్‌ వంటి ఫార్మసీలు మినహాయింపు లేకుండా యథావిధిగా సేవలు అందిస్తాయి. అత్యవసర (ఎమర్జెన్సీ) సేవలు, ఆస్పత్రుల్లోని ఇన్‌-పేషెంట్‌(ఐపీ) రోగులకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవ’ని ఏడీ చంద్రరావు తెలిపారు. బంద్‌ విషయమై పది రోజులుగా మెడికల్‌ షాపుల వద్ద పోస్టర్లు, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా వినియోగదారులను అప్రమత్తం చేశాం. బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి అవసరమైన మందులను మెడికల్‌ షాపుల నిర్వాహకులు ముందుగానే పంపిణీ చేశాం. బంద్‌ను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని ఫార్మా ట్రేడ్‌ నాయకులకు సూచించాం. ఇందుకు వారు కూడా సానుకూలంగా స్పందించార’ని ఏఈ చంద్రరావు తెలిపారు.

  • మందుల కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్లు...

  • ఎవరికైనా అత్యవసరంగా మందులు అవసరమైతే తక్షణ సహాయం కోసం డ్రగ్స్‌కంట్రోల్‌ అధికారులను, ఫార్మా ప్రతినిధులను సంప్రదించవచ్చు. శ్రీకాకుళం- 91334 33334, 84999 44559, 94406 61178, 93472 03185, జిల్లా సెక్రటరీ - 99089 90244, ఇతర అధికారుల నెంబర్లు - 76750 11567, 94400 35639.

Updated Date - May 20 , 2026 | 12:09 AM