Share News

వైద్య విజ్ఞానం పెంపోదించుకోవాలి

ABN , Publish Date - May 29 , 2026 | 11:47 PM

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వైద్యవిజ్ఞానం పెంపోదించుకోవాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు.

వైద్య విజ్ఞానం పెంపోదించుకోవాలి
నరసన్నపేట: మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

  • నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, మే 29(ఆంధ్రజ్యోతి): మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వైద్యవిజ్ఞానం పెంపోదించుకోవాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్సను అందజేసి ఎన్నో ప్రాణాలను కాపాడిని పారామెడికల్‌ సిబ్బందికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. శుక్రవారం నరసన్నపేటలో కమ్యూనిటీ పారామెడికల్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుదూర ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో సేవలను అందించి ప్రజలకు సేవలు అందిస్తున్న పారామెడికల్‌ సిబ్బంది సేవలను ప్రశంచారు. డీఎంహెచ్‌వో అనిత మాట్లాడుతూ పారామెడికల్‌ కమ్యూనిటీ అందించే సేవలతో ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో తాడేల శ్రీకాంత్‌, పొన్నాడ గణేష్‌, బలగ మురళీ, సీఐ మరడాన శ్రీనివాసరావు, సంఘ జిల్లా అధ్యక్షుడు తర్ల భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి తిమ్మల విజయ్‌కుమార్‌, పంగ రమేష్‌, కె.రాము, కాల్ల సింహాచలం, ప్రసాద్‌, కూర్మారావు పాల్గొన్నారు.

కత్తెరవానిపేటలో ప్రజాదర్డార్‌

పోలాకి, మే, 29(ఆంధ్రజ్యోతి): కత్తెరవానిపేట క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్‌ను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గుఅర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి వచ్చిన వినతులను పరిశీలించారు.ప్రజాప్రతినిధులుగా బాధ్యతను నెరవేరుస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - May 29 , 2026 | 11:47 PM