చిన్ని గుండెకు వైద్య భరోసా
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:40 PM
పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు జిల్లా బాల్య ఆరోగ్య సంరక్షణ కేంద్రం భరోసా ఇస్తుందని డీఎంహెచ్‌వో డా.కె.అనిత అన్నారు.
అరసవల్లి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): పుట్టుకతోనే గుండె సంబం ధిత సమస్యలతో బాధపడు తున్న చిన్నారులకు జిల్లా బాల్య ఆరోగ్య సంరక్షణ కేంద్రం భరోసా ఇస్తుందని డీఎంహెచ్‌వో డా.కె.అనిత అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసు పత్రిలో ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ శివరంజని, పీడియాట్రిక్ విభాగాధిపతి డా.పి. రాము పర్య వేక్షణలో విశాఖపట్నానికి చెందిన ప్రముఖ పీడియాట్రిక్ కార్డియాలజిస్టు డా. అశోక్‌రాజు చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వ హించారు. అత్యాధునిక పరికరాలతో 2డి-ఎకో, కార్డియోగ్రఫీ పరీక్షలు చేశారు. గుండె సమస్య లు తీవ్రంగా ఉన్న చిన్నారులను గుర్తించి, వారికి మెడికవర్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవ పథ కంలో శస్త్ర చికిత్సలను పూర్తి ఉచితంగా చేస్తా మని తెలిపారు. శుక్రవారం టెక్కలి జిల్లా ఆసు పత్రి డీఈఐసీ కేంద్రంలో వైద్య శిబిరం నిర్వ హిస్తున్నామని, గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ నూక చైతన్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.