వైద్యఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:07 PM
: తమ సమస్యలు పరిష్క రించాలని వైద్యఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.
శ్రీకాకుళం కల్చరల్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్క రించాలని వైద్యఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. శ్రీకాకుళంలోని రిమ్స్, టెక్కలితో పాటు పలు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం వినూత్నంగా కళ్లకు గంతలు కట్లుకొని నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కొద్దిరోజులుగా వివిద రూపాల్లో నిరసన తెలుపుతున్నారు.