Share News

వైద్య విద్యలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:11 AM

వైద్య విద్యలో ప్రవే శాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ శ్రీకాకుళం రిమ్స్‌కు 160 మంది విద్యార్థులను కేటాయించింది.

వైద్య విద్యలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం
రిమ్స్‌ కాలేజీలో చేరేందుకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు

తొలివిడతలో రిమ్స్‌కు 160 మంది కేటాయింపు

ఇప్పటి వరకు 42 మంది చేరిక

శ్రీకాకుళం కల్చరల్‌, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): వైద్య విద్యలో ప్రవే శాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ శ్రీకాకుళం రిమ్స్‌కు 160 మంది విద్యార్థులను కేటాయించింది. కళాశాలలో చేరే ప్రక్రియ ప్రారంభం కాగా గురువారం 17 మంది, శుక్రవారం 25 మంది విద్యార్థులు చేరినట్లు ప్రిన్సిపాల్‌ డా.ఎస్‌.అప్పలనాయుడు తెలిపారు. కౌన్సెలింగ్‌లో విద్యార్థులు ఒక మెడికల్‌ కాలేజీ నుంచి మరో కాలేజీకి మారే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సర్టిఫికెట్లు, అలాట్‌మెంట్‌ పరిశీలన ప్రక్రియ చేపట్టారు. విద్యార్థుల ఫిజికల్‌ కొలత లను కూడా తీసుకున్నారు. ఏడో తేదీ వరకు అలాట్‌ అయిన విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది.

Updated Date - Sep 05 , 2026 | 12:11 AM