రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీల్లో జిల్లాకు పతకాలు
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:02 AM
ఒంగోలులో జరిగిన 70వ ఆంధ్రప్రదేశ్ ఎస్జీఎఫ్ అంతర్జిల్లాల బాక్సింగ్ టోర్నమెంట్లో జిల్లా క్రీడాకా రులు పతకాల పంట పండించారు.
శ్రీకాకుళం స్పోర్ట్స్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఒంగోలులో జరిగిన 70వ ఆంధ్రప్రదేశ్ ఎస్జీఎఫ్ అంతర్జిల్లాల బాక్సింగ్ టోర్నమెంట్లో జిల్లా క్రీడాకా రులు పతకాల పంట పండించారు. అండర్- 14, 17 విభాగాల్లో బాలబాలికలు రెండు బంగారు, ఐదు రజి తం, ఐదు కాంస్య పతకాలు సాధించి జిల్లా సత్తా ను చాటారు. అలాగే ఈనెల 12 నుంచి 14 వరకు తిరుపతి సమీపంలోని తానేపల్లిలో జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో అండర్-14, 19 బాలబాలికల జూడో చాంపియన్షిప్ పోటీల్లో జిల్లాకు ఒక బంగారు, ఒక రజితం, నాలుగు కాంస్య పతకాలు తీసుకు వచ్చారు. వీరిని ఆయా సంఘాల ప్రతినిధులు అభినందించారు.