Share News

పరిశోధన విద్య బలోపేతానికి చర్యలు: వీసీ

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:27 PM

పరిశోధన విద్య బలోపేతం లక్ష్యం గా చర్యలు తీసుకుంటున్నామని అంబేడ్కర్‌ విశ్వ విద్యాలయం వీసీ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజని అన్నారు.

పరిశోధన విద్య బలోపేతానికి చర్యలు: వీసీ

ఎచ్చెర్ల రూరల్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): పరిశోధన విద్య బలోపేతం లక్ష్యం గా చర్యలు తీసుకుంటున్నామని అంబేడ్కర్‌ విశ్వ విద్యాలయం వీసీ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజని అన్నారు. మంగళవారం వర్సి టీ బోర్డ్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ స్టడీస్‌ సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీహెచ్‌డీ విద్య బలో పేతం కావాలన్నారు. వర్సిటీ అర్హత కలిగిన గైడ్‌లున్న కోర్సుల్లో మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. గైడ్స్‌ గుర్తింపు లో వచ్చిన లోపాలు, ఫిర్యాదులను పరి గణనలోకి తీసుకుంటామన్నారు. రీసెర్చ్‌ స్కాలర్లకు సకాలంలో డాక్టరేట్‌లు అందజే యాల్సిన అవసరం వర్సిటీ అధికారులు, గైడ్‌లపై ఉందన్నారు. విద్యా ర్థుల పరిశో ధనలు సమాజ ప్రగతికి ఉపయోగ పడాల న్నారు. సమీక్షలో రిజిస్ట్రార్‌, ప్రొఫెసర్‌ బి.అడ్డయ్య, అకడమిక్‌ అఫైర్స్‌ డీన్‌ కె.స్వప్నవాహిని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 11:27 PM