Share News

‘డీసీఎంఎస్‌ ఆర్థిక పరిపుష్టికి చర్యలు’

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:29 PM

డీసీఎంఎస్‌ ఆర్థిక పరిపుష్టికి చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్‌ చౌదరి అవినాష్‌ అన్నారు. డీసీఎంఎస్‌ జిల్లా కార్యాలయంలో 70వ ప్రథమ వార్షిక సమా వేశం మంగళవారం నిర్వహించారు.

‘డీసీఎంఎస్‌ ఆర్థిక పరిపుష్టికి చర్యలు’
మాట్లాడుతున్న డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌

అరసవల్లి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): డీసీఎంఎస్‌ ఆర్థిక పరిపుష్టికి చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్‌ చౌదరి అవినాష్‌ అన్నారు. డీసీఎంఎస్‌ జిల్లా కార్యాలయంలో 70వ ప్రథమ వార్షిక సమా వేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరసవల్లిలోని పాత గోదా మును ఆధునికీకరించి కన్వెన్షన్‌ సెంటర్‌గా తయారుచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తా మన్నారు. ఉద్యోగు ల సంక్షేమం కోసం హెల్త్‌ స్కీమ్‌, ఒకటో తేదీన జీతాల చెల్లింపు జరుగుతుం దన్నారు. 2025-26 సంవత్స రానికి సంబంధించి జమా ఖర్చులపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదిం చారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ ఎస్‌.సూర్య నారాయణ, సీఈవో డి.సత్యనారాయణ, సహకార అధికారి బి.మురళీకృష్ణ, మార్పు జగ్గునాయుడు, సంఘం డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 11:29 PM