Share News

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:50 PM

గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
తాగునీటి సరఫరా శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఆమదాలవలస, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. శనివారం వంజంగిపేటలో ఆర్‌డబ్ల్యూఎస్‌ పారిశుధ్య నిధులతో నిర్మించిన తాగునీటి సరఫరా పథ కాన్ని ప్రారంభించారు. గ్రామంలో ఇప్పటికే ఇంటింటి నీటి కుళాయిల పథ కం ఉన్నప్పటికీ వచ్చే వేసవి దృష్ట్యా ఎటువంటి నీటి సమస్య ప్రజ లకు ఉండకూడదని ఉద్దేశంతో నాగావళి నది నుంచి ప్రత్యేకంగా నీటిని తీసుకు వచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, విద్యాశాఖామంత్రి లోకేష్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, టీడీపీ మండల అధ్య క్షుడు నూకరాజు, రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తమ్మినేని చంద్రశేఖర్‌, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుజాత, మాజీ సర్పంచ్‌ లక్ష్మి, అధికారులు, పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 11:50 PM