ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:38 PM
ఆమదాలవలస మునిసిపాలిటీ లోని ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాల వలస, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస మునిసిపాలిటీ లోని ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఈ మేరకు శనివారం 13వ వార్డు కాలేజీ వీధిలో పర్యటించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలిం చిన ఆయన ప్రజలు కొంత స్థలాన్ని ప్రభుత్వానికి అందిస్తే అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుం దన్నారు. స్థానికులు తెలిపిన సమస్య లపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం కిల్లి వారి చెరువును పరిశీలిం చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.