Share News

సమస్యల పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:21 AM

ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్‌ అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

 సమస్యల పరిష్కారానికి చర్యలు
బోరవానిపేట బెస్ట్‌ పంచాయతీ సర్టిఫికెట్‌ను ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం అర్బన్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్‌ అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. ప్రభుత్వ పరిపాలన ప్రజల వద్దకే తీసుకు వెళ్లాలన్న ఉద్దేశంతో ప్రతీ సోమవారం కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుం డగా ప్రతీ శుక్రవారం ఎమ్మెల్యేలు పీజీఆర్‌ఎస్‌ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ మేరకు కార్పొరేషన్‌ కార్యాలయంలో గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించి 55 వినతులను స్వీకరించారు. ఫిర్యాదుదారులకు తక్షణమే పరిష్కార మార్గా లను లేదా జవాబులను పంపించేలా చర్యలు తీసుకుంటు న్నామన్నారు. ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శక సేవ లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నా రు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ కమిషనర్‌ శ్రావణ్‌ కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పంచాయతీ అభివృద్ధికి పాటుపడాలి

జాతీయ స్థాయిలో చైల్డ్‌ ఫ్రెండ్లీ పంచాయతీగా గార మండలం బోరవానిపేట ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ శాఖ కమిషనర్‌ అందించిన ఐఎస్‌ఐ సర్టిఫి కెట్‌ను పీడీవో కృష్ణవేణి ఎమ్మెల్యే శంకర్‌కు చూపించారు. ఈ సందర్భంగా పంచాయతీ అధికారులను ఎమ్మెల్యే అభినందించి ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో పంచాయతీ అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గార మండల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 12:21 AM