ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:27 AM
నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాల మార్గంలో ఉన్న కుమ్మరవీధిలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియను నగరపాలక సంస్థ అధికారులు ఆదివారం ప్రయత్నించారు. అయితే వాటిని స్థానికులు అడ్డుకున్నారు.
అడ్డుకున్న స్థానికులు
శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాల మార్గంలో ఉన్న కుమ్మరవీధిలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియను నగరపాలక సంస్థ అధికారులు ఆదివారం ప్రయత్నించారు. అయితే వాటిని స్థానికులు అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఈ వీధిలో నివాసముంటున్న లావేరు పోలీస్ కానిస్టేబుల్ భారతి, ఆమె ఇంటిపక్కనే ఉంటున్న సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ హరి కుటుంబాల మధ్య వాహన పార్కింగ్ విషయమై వివాదం మొదలైంది. దీంతో వీధంతా ఆక్ర మణలు ఉన్నాయంటూ వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఎస్పీతో పాటు నగర పాలక సంస్థ అధికారులు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకటో పట్టణ పోలీసులు ఇద్దరిపైనా కేసులు నమోదు చేశారు. తాజాగా నగర పాలక సంస్థ కమిషనర్ శ్రావణ్ కుమార్ స్పందించి వీధిలోని ఆక్రమణ లుంటే తొలగించాలని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ఆదేశిం చారు. ఆదివారం సిబ్బంది అక్కడకు వెళ్లి ఆక్రమణలను తొలగించేందు కు యంత్రంతో సిద్ధం కాగా స్థానికులు అడ్డుకుని వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేది లేక నగరపాలక సంస్థ సిబ్బంది వెనక్కి వెళ్లారు.