Share News

బాధితులకు న్యాయం చేసేలా చర్యలు

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:40 PM

ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యాదును చట్టబద్ధంగా, పారదర్శకం గా విచారణ చేపట్టి బాధితులకు సకా లంలో న్యాయం జరిగేలా చర్యలు తీసు కోవాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు.

బాధితులకు న్యాయం చేసేలా చర్యలు
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యాదును చట్టబద్ధంగా, పారదర్శకం గా విచారణ చేపట్టి బాధితులకు సకా లంలో న్యాయం జరిగేలా చర్యలు తీసు కోవాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాల యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారవేదికను నిర్వహిం చారు. ఈ సందర్భంగా జిల్లా నలు మూలల నుంచి వచ్చిన 61 ఫిర్యాదు లను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే పోలీస్‌శాఖ ప్రధా న బాధ్యత అని అన్నారు. శనివారం రాత్రి తన భర్త బలివాడ శేఖర్‌పై జిల్లా పరిషత్‌ కాలనీకి చెందిన దేశల్ల నారాయణ, రుప్ప శేషగిరి, శ్రీనివాస్‌రెడ్డి దాడి చేసి తీవ్రంగా గాయపరిచా రని, వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా గాయపడిన తన భర్త పై కేసు నమోదు చేస్తానని వన్‌టౌన్‌ ఎస్‌ఐ బెదిరి స్తున్నారని ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన బలివాడ ప్రశాంతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Updated Date - Aug 10 , 2026 | 11:40 PM