Share News

ఓటరు జాబితా తప్పుల లేకుండా చర్యలు

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:49 PM

ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని బీఎల్‌వోలను ఈఆర్‌వో ఎం.లావణ్య ఆదేశిం చారు.

ఓటరు జాబితా తప్పుల లేకుండా చర్యలు
పోలీంగ్‌ కేం ద్రాలను తనిఖీ చేస్తున్న లావణ్య పోలీంగ్‌ కేం ద్రాలను తనిఖీ చేస్తున్న లావణ్య

ఆమదాలవలస, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని బీఎల్‌వోలను ఈఆర్‌వో ఎం.లావణ్య ఆదేశిం చారు. శనివారం కృష్ణాపురం, లక్ష్మీనగర్‌లోని పోలింగ్‌ కేం ద్రాలను స్పెషల్‌ క్యాంపె యిన్‌ డే పురస్కరించుకొని లావణ్య ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించారు. ఫారం-6, 7, 8 దరఖాస్తు లను నిబంధనలు ప్రకారం పరిశీలించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరును జాబితాలో నమోదు చేయడంతోపాటు మార్పులు, సవరణలు కోసం సంబంధిత ఫారాలు సమర్పించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

Updated Date - Aug 29 , 2026 | 11:49 PM