Share News

సమృద్ధిగా తాగునీరు లభించేలా చర్యలు

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:07 AM

జలజీవన్‌ పఽథకం ద్వారా గ్రామాల్లో గత ప్రాజెక్టులకు అనుసంధానం చేయించి సమృద్ధిగా తాగునీరు లభించేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి భరోసాఇచ్చారు.

 సమృద్ధిగా తాగునీరు లభించేలా చర్యలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి :

పోలాకి, మార్చి 14(ఆంరఽఽదజ్యోతి): జలజీవన్‌ పఽథకం ద్వారా గ్రామాల్లో గత ప్రాజెక్టులకు అనుసంధానం చేయించి సమృద్ధిగా తాగునీరు లభించేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి భరోసాఇచ్చారు. శనివారం పోలాకి మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఎంపీపీ ముద్దాడ దమయంతి బైరాగినాయుడు అధ్యక్షతన చివరి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రహిమాన్‌పురం, బొద్దాం, గుప్పెడుపేట, చీడివలస, పోలాకి, చెల్లాయివలస, కొత్తరేవు గ్రామాల ప్రజాప్రతినిధులు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిపనుల బకాయి బిల్లులు చెల్లించాలని, పలుగ్రామాల్లో తాగునీటి వసతికల్పించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చా రు. సర్పంచ్‌లు, ఎంపీటీసీల పదవీకాలం ముగిసిందని, ఇంతవరకూ పార్టీ వివక్ష లేకుండా ఐదుసంవత్సరాల పాటు మండలాన్ని అభివృద్ధిపఽథంలో అగ్రగామిగా నిలిపినందుకు కృషిచేయడంతో ఎమ్మెల్యే అభినందించారు. పోలాకి సర్పంచ్‌, రహిమాన్‌పురం, చెల్లాయివలస ఎంపీటీసీలు 2024 నుంచి ఎంపీటీసీలకు గౌరవభృతి ఇప్పించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో కూడా ఎంపీటీసీలకు గౌరవభృతి బకాయి రావాల్సి ఉందని, చెల్లుకు చెల్లు అని కొందరు సభ్యులు వ్యాఖ్యానించడంతో వేదికపై ఉన్న ఎమ్మెల్యేతోపాటు జడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య, అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా నవ్వుకున్నారు. సమావేశంలో ఎంపీడీవో జి.రవికుమార్‌, డీటీ రాజారెడ్డి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు తాతారావు, అప్పారావు, పీఏసీఎస్‌ అధ్యక్షులు బైరి భాస్కరరావు, మండల పరిషత్‌ సలహాదారు ఎం.బైరాగినాయుడు పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 12:07 AM