భూ సర్వే ప్రక్రియ వేగవంతానికి చర్యలు
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:54 PM
రైతుల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న భూ రీ సర్వే ప్రక్రియను సక్రమంగా, వేగవంతం గా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ల్యాండ్ సర్వే, సెటిల్‌మెంట్ రాష్ట్ర డైరెక్టర్ రోణంకి కూర్మ నాథ్ అన్నారు.
ల్యాండ్ సర్వే, సెటిల్‌మెంట్ రాష్ట్ర డైరెక్టర్ కూర్మనాథ్
ఎచ్చెర్ల/రణస్థలం జూలై 28(ఆంధ్రజ్యోతి): రైతుల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న భూ రీ సర్వే ప్రక్రియను సక్రమంగా, వేగవంతం గా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ల్యాండ్ సర్వే, సెటిల్‌మెంట్ రాష్ట్ర డైరెక్టర్ రోణంకి కూర్మ నాథ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఎచ్చెర్ల మండలం ధర్మవరం, రణస్థలం మండలం సం చాం గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను పరిశీలిం చారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహణ తీరును పరి శీలించి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్వేలో ఖచ్చితత్వం పాటించా లని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో భూ సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జోషిలా, సర్వే విభా గం ఇన్‌స్పెక్టర్లు ప్రసాద్, చంద్రశేఖర్, డీఐవోఎస్ విజయకుమార్, తహసీ ల్దార్ బి.గోపాల్, మండల సర్వేయర్ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.