ఈవీఎంల రక్షణకు చర్యలు: కలెక్టర్
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:21 PM
ఈవీఎం, వీవీప్యాట్ గిడ్డంగుల వద్ద రక్షణకు ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ఈవీఎం, వీవీప్యాట్ గిడ్డంగుల వద్ద రక్షణకు ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని ఈవీఎంలు భద్రపరచిన గిడ్డంగిని ఆయన వివిధ రాజకీయ్ర పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించి, త్రైమాసిక తనిఖీచేశారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సం ఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతినెలా నివేదికలు పంపుతున్నామని, ప్రతి మూడు నెలలకు ఒకసారి రాజకీయపక్షాల ప్రతినిధుల సమక్షంలో గోదాము తని ఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, సి సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం, బీఎస్పీల ప్రతినిధులు పీఎంజేబాబు, అజిత్ కుమార్, సురేష్ సింగ్, రౌతు శంకరరావు, కేఎల్‌ఎస్ ఈశ్వరి, మహేష్, ఎల్.సోమే శ్వరరావు తదితరులు పాల్గొన్నారు.