సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:26 PM
సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి కోరారు.
పలాస, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి కోరారు. ఆదివారం పలాస టీడీపీ కార్యాలయంలో కూటమి పార్టీల నాయకుల తో సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా వెంకన్నచౌదరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన పాలన, సంక్షేమ పథకాలు అం దించే విధంగా బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపు నిచ్చారు. నియోజకవర్గంలో చేసిన, కొత్తగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా చర్చించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తీసుకోవాలని కోరారు. కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసుకుంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర ్మన్ మల్లా శ్రీనివాస్, గాలి కృష్ణారావు, ఎం.నరేంద్ర(చిన్ని), బడ్డ నాగరాజు, రామానందస్వామి, పి.వైకుంఠరావు పాల్గొన్నారు.