Share News

‘పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు’

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:03 AM

జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సెట్‌శ్రీ సీఈ వో బి.విశ్వేశ్వరరావు అన్నారు

‘పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు’
నృత్య ప్రదర్శన నిర్వహిస్తున్న కళాకారులు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సెట్‌శ్రీ సీఈ వో బి.విశ్వేశ్వరరావు అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం నగరంలోని అంబే డ్కర్‌ ఆడిటోరియంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. డీఐపీఆర్వో చెన్నకేశవరావు మా ట్లాడుతూ.. అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం వంటి ఆధ్యాత్మిక నిల యాలతో పాటు బీచ్‌ల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తు న్నాయన్నారు.

ఆకట్టుకున్న ప్రదర్శనలు

నరసన్నపేటకు చెందిన లక్ష్మీ నరసింహ కోలాట బృందం, రఘు పాత్రుని శ్రీకాంత్‌ శిష్యబృందం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ అఽధికారి ఉరిటి సాయికుమార్‌, ఇంటాక్‌ కన్వీనర్‌ నూక సన్యాసి రావు, పూర్వ కన్వీనర్‌ కేవీజే రాధాప్రసాద్‌, జిల్లా పర్యాటక అధికారి ఎన్‌.నారాయణరావు, స్వీప్‌ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ కె.రమణమూర్తి, ఎయిర్‌ ట్రావెల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నటుకుల మోహన్‌, కళా శాలల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 12:03 AM