మత్స్యకారుల సంక్షేమానికి చర్యలు
ABN , Publish Date - Jun 11 , 2026 | 11:29 PM
: మత్స్యకారుల సంక్షేమానికి, తీర ప్రాంత అభి వృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వర రావు తెలిపారు.
ఎచ్చెర్ల, జూన్ 11(ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల సంక్షేమానికి, తీర ప్రాంత అభి వృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వర రావు తెలిపారు. బుడగట్లపాలెం తీరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ.444 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరుచేయడంతో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును తీర ప్రాంత గ్రామాల ప్రజలు గురువారం తన క్యాంప్ ఆఫీసులో సత్కరించారు. కార్యక్రమంలో బుడగట్లపాలెం, బడివానిపేట గ్రామాల మాజీ సర్పంచ్‌లు అల్లుపల్లి రాంబాబు, వారది ఎర్రయ్య, బడివానిపేట ఎంపీటీసీ సమరం, డి.మత్స్యలేశం మాజీ ఎంపీటీసీ మూగి కొర్లయ్య, మత్స్యకార ప్రతినిధులు మైలపల్లి పోలీసు, సూరాడ రాముడు, కొమర లక్ష్మణ పాల్గొన్నారు.