తీర ప్రాంత పరిరక్షణకు చర్యలు
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:52 PM
తీర ప్రాంతం పరిరక్షణకు పటిష్టమైన శాశ్వత చర్యలు చేపట్టనున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు.
శ్రీకాకుళం అర్బన్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తీర ప్రాంతం పరిరక్షణకు పటిష్టమైన శాశ్వత చర్యలు చేపట్టనున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. గురువా రం మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యటించారు. గురువారం పీజీపేట తీర ప్రాంతంలో సముద్రం కోతకు గురవుతున్న పరిసరాలతోపాటు ఇటీవల కురిసిన వర్షాలకు నీటమునిగిన కిల్లిపాలెం, వాడాడ పంచాయతీల పరిధిలోని పంట పొలాలను పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గతంలో తీర రక్షణ కోసం నిర్మిం చిన రాతికట్టడం వల్ల ఇప్పటికే పీజీపేట గ్రామానికి చాలా వరకు రక్షణ లభించిందని, ఈ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేదిశగా ప్రస్తుతం ఉన్న ఎల్ ఆకారపు గ్రోయి న్‌ను మరో 50 మీటర్ల మేర పొడిగించడంతో పాటు దానికి సరిగ్గా సమాంతరంగా ఇంకొక గ్రోయిన్‌ను నిర్మించాల్సి ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికే మంజూరైన రూ.50 లక్షలతో పనులను శరవేగంగా పూర్తి చేయాలన్నారు.
ఓటమి భయంతోనే బురదచల్లే ప్రయత్నం
బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమితో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు సాగుతున్నామని, ఓటమి భయంతోనే గొడ్డలి పార్టీ నాయకులు కూటమి పార్టీలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని శీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ విమర్శించారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో 60 డివిజన్లు గెలుపు ఖాయమని దీమా వ్యక్తంచేశారు. గురు వారం శ్రీకాకుళంలోని జిల్లా టీడీపీకార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం నియోజకవ ర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, గార మండలంలోని మొగదాలపాడును రెవెన్యూ పట్టణంగా అభివృద్ధి చేశామన్నారు. గతంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్ని కలను స్వార్థ రాజకీయాలకోసం నిర్వహించకుండాచేసి పార్టీ క్యాడర్‌ను నిర్వీర్యం చేయడంతో పాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని వైసీపీ నాయకులపై ఆరోపిం చారు. సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మొదలవలస రమేష్, కోరాడ సర్వేశ్వరరావు,పైడి వేణుగోపాలం, రెడ్డిశంకర్, కోరాడ హరగోపాల్, సిద్దయ్య పాల్గొన్నారు.
రైతులను ఆదుకుంటాం
గార, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి):ముంపునకు గురై పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. మండలంలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటపొలాలను గురువారం ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించి రైతుల తో మాట్లాడారు. శ్రీకూర్మం జంక్షన్ రోడ్డుపై నిలిచిపోయిన వర్షం నీటిని పరిశీలించి రాకపోకలకు వీలుగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఽఅధికారులకు ఆదేశించారు.