Share News

పశు సంపద అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:09 AM

పశు సంపద అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసు కుంటోందని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ అన్నా రు.

పశు సంపద అభివృద్ధికి చర్యలు
లేగ దూడలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఎమ్మెల్యే కూన రవికుమార్‌

బూర్జ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): పశు సంపద అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసు కుంటోందని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ అన్నా రు. కొల్లివలసలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పశువులు ఆరోగ్యంపై పాడి రైతులు శ్రద్ధ వహించాలన్న ఉద్దేశంతో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. పాడి సంపద అభివృద్ధికి ప్రభు త్వం పలు పథకాలు అమలు చేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాల న్నారు. అలాగే లేగ దూడల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఉత్తమ లేగ దూడలకు బహు మతులు అందించారు. కార్యక్రమంలో మార్క్‌ ఫెడ్‌ డైరెక్టర్‌ రామకృష్ణ నాయుడు, మాజీ ఎమ్మె ల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, పశు సంవర్థక శాఖ ఏడీ ఆనందం, పశువైద్యులు తదితరులు పాల్గొన్నారు.

‘బాధ్యతాయుతంగా స్పందించాలి’

ఆమదాలవలస, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ప్రజాదర్బార్‌లో వచ్చే వినతుల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాలని రాష్ట్ర పీయూసీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. శ్రీకాకుళం శాంతి నగర్‌ కాలనీలోని తన స్వగృహంలో శుక్రవారం ఆమదాలవలస నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరిం చారు. ఈ సందర్భంగా ఆయన వెంటనే సంబం ధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీతాసాగర్‌, నాయకులు ఎస్‌.మురళీ ధర్‌, పీవీకేరాజు, నాగళ్ల మురళీధర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 12:09 AM