గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి చర్యలు: శంకర్
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:31 PM
గ్రామీణ ప్రాంతాల్లో రహ దారులను మెరు గుపర్చేం దుకు చర్యలు తీసు కుంటున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
గార, అక్టో బరు 5 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో రహ దారులను మెరు గుపర్చేం దుకు చర్యలు తీసు కుంటున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సోమవారం మండలంలోని సీఎస్పీ రోడ్డు నుంచి రాఘ వాపురం వరకు రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమం లో పంచాయతీరాజ్ ఏఈ కేసీహెచ్ మహంతి, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు
గార, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే ప్రధాన ఉద్దేశమని ఎమ్మె ల్యే గొండు శంకర్ అన్నారు. అంబళ్లవలస గ్రామంలో సోమవారం రా త్రి జలజీవన్‌మిషన్ ద్వారా మంజూరైన పనులకు శంకుస్థాపన చేశారు కార్య క్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శ్రీకాకుళం అర్బన్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో అభి వృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలి పారు. రూరల్ మండలం కల్లేపల్లి పరిసర ప్రాంతాల్లో సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలువురు అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.