మెరుగైన బోధనకు చర్యలు
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:58 PM
గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన బోధనకు చర్య లు తీసుకుంటున్నామని, అలాగే విద్యార్థులకు ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక తర్పీదు ఇస్తున్నట్లు రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ఈఐఎస్) అడిషనల్ సెక్రటరీ రాజ్యలక్ష్మి అన్నారు.
రాష్ట్ర గురుకులాల అడిషనల్ సెక్రటరీ రాజ్యలక్ష్మి
శ్రీకాకుళం ఎడ్యుకేషన్/ ఎచ్చెర్ల/శ్రీకాకుళం అర్బన్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి) గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన బోధనకు చర్య లు తీసుకుంటున్నామని, అలాగే విద్యార్థులకు ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక తర్పీదు ఇస్తున్నట్లు రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ఈఐఎస్) అడిషనల్ సెక్రటరీ రాజ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు సోమవారం ఎచ్చెర్ల, దుప్పలవలస, కొల్లివలస, పెద్దపాడు గురుకుల విద్యాలయాలను సందర్శించారు. విద్యాప్రమాణాలు, ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. గురుకులాల్లో చదువుచున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యతో పాటు నైతిక విలువల, మానసిక స్థైర్యం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దపాడు గురుకులంలో తాగునీటి సమస్య ఉన్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దేవి ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. పది, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంపై ఆనం దం వ్యక్తంచేస్తూ ఉపాధ్యాయులను అభినందిం చారు. కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ యశోదలక్ష్మి, గురుకులాలు ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
‘ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోండి’
ఎచ్చెర్ల రూరల్, జూన్ 22(ఆంధ్రజ్యోతి): పాతపట్నం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని పూజ మృతికి కారణమైన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని దళిత జేఏసీ నాయకులు దుర్గాసి గణేష్ తదితరులు కోరారు. దుప్పలవలస గురుకుల పాఠశాలకు సోమవారం వచ్చిన ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ అడిషనల్ సెక్రటరీ రాజ్య లక్ష్మిని కలిసి వినతి పత్రం అందించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగు లకు బకాయిలున్న ఐదు నెలల వేతనాలు అందించాలని కోరారు.