Share News

భోగాపురం వెళ్లే ప్రజలకు భోజనాలు

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:39 AM

భోగా పురంలో ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ వివా నాశ్రయం ప్రారంభోత్సవం సంద ర్భంగా ప్రధాని మోదీ సభకు వెళ్లే ప్రజలకు మధ్యాహ్నం భోజనం ఏర్పా టు చేయనున్న స్థలాలను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకరన్‌ పుండ్కర్‌ గురు వారం పరిశీలించారు.

భోగాపురం వెళ్లే ప్రజలకు భోజనాలు
బెజ్జిపురంలో స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

స్థలాలను పరిశీలించిన కలెక్టర్‌

లావేరు, జూలై 30 (ఆంధ్రజ్యోతి): భోగా పురంలో ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ వివా నాశ్రయం ప్రారంభోత్సవం సంద ర్భంగా ప్రధాని మోదీ సభకు వెళ్లే ప్రజలకు మధ్యాహ్నం భోజనం ఏర్పా టు చేయనున్న స్థలాలను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకరన్‌ పుండ్కర్‌ గురు వారం పరిశీలించారు. తాళ్లవలస వద్ద వేద మాత వెంచర్‌, బెజ్జిపురం వద్ద ఉన్న సిక్కోలు హైల్యాండ్స్‌ వెంచర్లు జాతీయ రహదారి పక్కనే ఉండడంతో వాహ నాలు రాకపోకలకు అనుకూలంగా ఉంటాయని అధికారులు, ప్రజా ప్రతినిధులు గుర్తించారు. ఈ స్థలాలను శుభ్రం చేసే పనులు చేయిస్తు న్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయి ప్రత్యూష, తహ సీల్దార్‌ జీఎల్‌ఈ శ్రీనివాసరావు, ఎంపీడీవో పి.వెంకటరాజు, నరసన్నపేట, పోలాకి తహసీ ల్దార్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 12:39 AM