భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
ABN , Publish Date - May 14 , 2026 | 11:43 PM
అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించి మంచి పేరు తీసుకురావాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఆకాంక్షించారు.
రణస్థలం, మే 14 (ఆంధ్రజ్యోతి): అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించి మంచి పేరు తీసుకురావాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఆకాంక్షించారు. గురువారం రణస్థలంలోని ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదోతరగతి పరీక్షల్లో 550కు పైగా మార్కులు సాధించిన 218 మంది విద్యార్థులు, తలిదండ్రులు, గురువులకు ఎమ్మెల్యే సన్మానించారు. పదో తరగతి పరీక్షలో జిల్లాలో టాపర్‌గా నిలిచిన ఎస్.దేవీప్రియ, సెకెండ్ వచ్చిన రమ్యశ్రీ, బీసీ హాస్టల్స్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చిన సాయికార్తీక్‌ను అభినందించారు. ఈ సందర్భంగా డీఈవో రవిబాబు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం ఆనందంగ ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ ఎన్.తేజాబాబు, సుగుణాకర్‌రావు, ఎంఈవోలు, కూటమి నాయకులు లంక శ్యామలరావు భోనూజినాయుడు, పిషిని జగన్నాధంనాయుడు, శ్రీను పాల్గొన్నారు.