టీడీపీలోకి భారీ చేరికలు
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:04 AM
మండల పరిధి ముండలా పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ రామచంద్ర ప్రధాన్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముండలా, జిల్లుండ గ్రామాలకు చెందిన ఆయన అనుచరులు ప్రకాష్ ప్రధాన్, దుదిష్టి ప్రధాన్, ప్రఫూల్ ప్రధాన్, గోరాచరణ్, తరిణి తదితర 40 కుటుంబాలు శనివారం టీడీపీలో చేరాయి.
కంచిలి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మండల పరిధి ముండలా పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ రామచంద్ర ప్రధాన్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముండలా, జిల్లుండ గ్రామాలకు చెందిన ఆయన అనుచరులు ప్రకాష్ ప్రధాన్, దుదిష్టి ప్రధాన్, ప్రఫూల్ ప్రధాన్, గోరాచరణ్, తరిణి తదితర 40 కుటుంబాలు శనివారం టీడీపీలో చేరాయి. వీరికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఐక్యంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మాదిన రామారావు, బంగారు కురయ్య, జగదీష్ పట్నాయక్, రమేష్‌చంద్ర మహంతి, మద్దిల ఆనంద్, కిషోర్ పాడి తదితరులు పాల్గొన్నారు.
గంగంపేట నుంచి 10 వైసీపీ దళిత కుటుంబాలు..
ఆమదాలవలస, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): బూర్జ మండలం చీడివలస పంచాయతీ గంగంపేట గ్రామానికి చెందిన 10 దళిత కుటుంబాలు వైసీపీని వీడి శనివారం టీడీపీలో చేరాయి. వీరికి రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.