టీడీపీలో భారీ చేరికలు
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:13 AM
మునిసిపాల్టీలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. 8వ వార్డులో ఆ పార్టీకి చెందిన 30 కుటుంబాలు శుక్ర వారం రామయ్యపుట్టుగ కార్యాలయం లో టీడీపీలో చేరాయి. వీరికి ఎమ్మెల్యే బెందాళం అశోక్, పార్టీ పరిశీలకుడు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్ పార్టీ కండు వాలు వేసి ఆహ్వానించారు.
మాజీ కౌన్సిలర్‌తో పాటు మరో 30 కుటుంబాలు టీడీపీలోకి..
ఇచ్ఛాపురం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): మునిసిపాల్టీలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. 8వ వార్డులో ఆ పార్టీకి చెందిన 30 కుటుంబాలు శుక్ర వారం రామయ్యపుట్టుగ కార్యాలయం లో టీడీపీలో చేరాయి. వీరికి ఎమ్మెల్యే బెందాళం అశోక్, పార్టీ పరిశీలకుడు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్ పార్టీ కండు వాలు వేసి ఆహ్వానించారు. 8వ వార్డుకు చెందిన వైసీపీ సీనియర్ నాయ కుడు, మాజీ కౌన్సిలర్ కుండల అప్పన్నతో పాటు కూర్మారావు, ఆనంద్, 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. టీడీపీ సిద్ధాంతాలు నచ్చి చేరామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ కొండా శంకర్‌రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పత్రి తవిటయ్య, సెక్రటరీ నందిగాం కోటి, నేతలు కాళ్ల ధర్మారావు, కాళ్ల జయదేవ్, ఆశి లీలారాణి పాల్గొన్నారు.
జీడి, మామిడి మొక్కల పంపిణీ
కంచిలి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉద్యానశాఖ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న జీడి, మామిడి విస్తరణ పథకాన్ని అర్హులు వినియో గించుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ కోరారు. కత్తివరం గ్రామంలో శుక్రవారం రైతులకు జీడి మొక్కలను పంపిణీ చేశారు. కత్తివరం, పులకపుట్టుగ, కత్తివరం కాలనీ, తలతంపర గ్రామాలకు చెందిన రైతులకు 6,050 నాణ్యమైన జీడి మొక్కలను అందించామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పైల పురుషోత్తంరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు, ఉద్యానశాఖాధికారి పి.మాధవీలత, అధికారులు గంగరాజు, పలువురు రైతులు పాల్గొన్నారు.