ఘనంగా సామూహిక మంగళ గౌరీ వ్రతాలు
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:00 AM
శ్రావణమాసం మంగళవారం సందర్భంగా గ్రామ దేవత స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో సా మూహిక మంగళ గౌరీ వ్రతాలు నిర్వహించారు.
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): శ్రావణమాసం మంగళవారం సందర్భంగా గ్రామ దేవత స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో సా మూహిక మంగళ గౌరీ వ్రతాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మూర్తి పంతులు 51 మంది మహిళలతో వ్రతం, కుంకుమ పూజలు చేయించారు. వ్రతాల్లో పాల్గొన్న మహిళలకు లక్కీడీప్ ద్వారా విజేతకు అమ్మవారి పట్టుచీరను బహూకరించారు.
విజయలక్ష్మి అలంకారంలో..
శ్రీకాకుళం కల్చరల్, సెప్టెంబరు 1 (ఆంధ్ర జ్యోతి): నగరంలోని నానుబాల వీధిలో వేంచేసి ఉన్న విజయ దుర్గమ్మ మంగళవారం విజయ లక్ష్మిగా దర్శన మిచ్చారు. శ్రావణ మంగళవారం సంద ర్భంగా అమ్మ వారిని పెద్ద సంఖ్యలో మహి ళలు దర్శించు కుని ప్రత్యేక పూజలు చేశారు.