Share News

అప్పుల బాధతో తాపీమేస్త్రి ఆత్మహత్య

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:34 AM

పట్టణంలోని సురంగి రాజావారి కోట సమీపంలో పైడి ఢిల్లేశ్వరరావు(50) అప్పులబాధ తాళలేక శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతో తాపీమేస్త్రి ఆత్మహత్య

ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సురంగి రాజావారి కోట సమీపంలో పైడి ఢిల్లేశ్వరరావు(50) అప్పులబాధ తాళలేక శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఢిల్లీశ్వర రావు 15 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చి నివాసం ఉంటూ తాపీమేస్త్రీ పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు. వారి పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులను కొంతమేర తీర్చాడు. అయితే మిగిలిన అప్పులు తీర్చలేనన్న ఆందోళనతో మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంటి సమీపంలోని తోటలో ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకుని ఎస్‌ఐ ముకుందరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీ లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి వైర్లు చోరీ

శ్రీకాకుళం రూరల్‌, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): సింగుపురం పంచాయతీ జగనన్న కాలనీలో 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగి వైర్లు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై శుక్రవారం ట్రాన్స్‌కో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎంశ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని వలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొ న్నారు. కేసునమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ కె.రాము తెలిపారు.

చైన్‌ స్నాచర్‌ పట్టివేత

నందిగాం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): నర్సిపురంలో బంగారు పుస్తెలతాడు చోరీకి గురైన కేసును పోలీసులు ఐదు రోజుల్లోనే ఛేదించి నిందితుడి పట్టుకు న్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 22న అదే గ్రామానికి చెందిన నెయ్యిల మహలక్ష్మి కళ్లల్లో కారంకొట్టి పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ ఆలీ దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నర్సిపురం గ్రామ కూడలి సమీపంలో అనుమా నాస్పదంగా తిరుగుతున్న కొన్ని తిరుమలరావును అదుపులోకి తీసుకుని విచారిం చగా.. చోరీ విషయాన్ని బయటపడింది. దీంతో అతడిని అరెస్టు చేఉసి కోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు.

Updated Date - Feb 28 , 2026 | 12:34 AM