స్వీయ రక్షణకు మార్షల్ ఆర్ట్స్ దోహదం: ఏఎస్పీ
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:27 PM
స్వీయరక్షణకు మార్షల్ ఆర్ట్స్ దోహదం చేస్తుందని, ప్రతి విద్యార్థిని నేర్చుకోవాలని ఏఎస్పీ కేవీ రమణ కోరారు.
శ్రీకాకుళం క్రైం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): స్వీయరక్షణకు మార్షల్ ఆర్ట్స్ దోహదం చేస్తుందని, ప్రతి విద్యార్థిని నేర్చుకోవాలని ఏఎస్పీ కేవీ రమణ కోరారు. అంతర్జాతీయ మహిళా వారోత్సవాల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో నారీమణి ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా కళాశాలలో బుధవారం సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, తైక్వాండో, కరాటే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. ఆత్మరక్షణలో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, అప్పుడే ఎలాంటి అపాయకర పరిస్థితుల నైనా ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందన్నారు. మహిళల భద్రతకు పోలీసులు కట్టుబడి ఉన్నారని తెలిపారు. డీఎస్పీ సీహెచ్ వివేకానంద మాట్లాడుతూ.. విద్యతో పాటు స్వీయరక్షణకు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాది పొట్టుసూరు పద్మ, హ్యూమన్ రైట్స్ సభ్యులు మణి శర్మ, డాక్టర్ తంగి సౌజన్య, జేసీఐ ప్రెసిడెంట్ టి.ఉషారాణి, యోగా ప్రెసిడెంట్ తంగి స్వాతి, ఎస్‌ఐలు లక్ష్మి, చంద్రకళ, లావణ్య, ఏఎస్‌ఐలు అరుణకుమారి, రేణుక తదితరులు పాల్గొన్నారు.