Share News

మర్రిగూడ ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్‌ సస్పెన్షన్‌

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:38 PM

మర్రిగూడ ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్‌ కె.బాలరాజును ఐటీడీఏ పీవో పవార్‌ స్పప్నిల్‌ మంగళవారం సస్పెండ్‌ చేశారు.

 మర్రిగూడ ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్‌ సస్పెన్షన్‌
మర్రిగూడ ఆశ్రమ పాఠశాలలో విచారణ జరుపుతున్న అధికారులు

హిరమండలం, ఏప్రిల్‌7(ఆంధ్రజ్యోతి): మర్రిగూడ ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్‌ కె.బాలరాజును ఐటీడీఏ పీవో పవార్‌ స్పప్నిల్‌ మంగళవారం సస్పెండ్‌ చేశారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘పాఠశాలలో.. మద్యం మత్తులో’ అనే కథనంపై పీవో స్పందించారు. ఈ మేరకు విచారణకు ఆదేశించారు. డిప్యూటీ డీఈవో, ఏటీడబ్ల్యూవో మంగళవారం ఆశ్రమ పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయులను విచారణ చేపట్టారు. ఈ విచారణలో డిప్యూటీ వార్డెన్‌ మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. అంతేకాకుండా విచారణ సమయంలో కూడా బాలరాజు మద్యం సేవించి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. నివేదికను పీవోకు అందించారు. దీంతో ఆయన్ను సస్పెండ్‌ చేశారు. విధి నిర్వహణలో ఎవరైన అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పీవో హెచ్చరించారు.

Updated Date - Apr 07 , 2026 | 11:38 PM