రైల్వే అండర్‌పాస్‌లో వివాహిత మృతి
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:38 AM
Woman dies after drowning in floodwaters రైల్వే అండర్‌పాస్‌లో నిలిచిన వరదనీటిలో పడి ఓ వివాహిత మృతిచెందింది. నందిగాం మండలం కవిటి అగ్రహారానికి చెందిన కోనారి కళ్యాణి (26) గురువారం రాత్రి బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది.
వరదనీటిలో మునిగి దుర్మరణం.. గ్రామస్థుల ఆందోళన
ప్రత్యేక అండర్‌పాస్ నిర్మిస్తామని ఏఈ హామీ
నందిగాం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): రైల్వే అండర్‌పాస్‌లో నిలిచిన వరదనీటిలో పడి ఓ వివాహిత మృతిచెందింది. నందిగాం మండలం కవిటి అగ్రహారానికి చెందిన కోనారి కళ్యాణి (26) గురువారం రాత్రి బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. ఆమె ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో భర్త కృష్ణారావు, కుటుంబసభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం అండర్‌పాస్‌లో నీటిని తొలగించేందుకు వచ్చిన సిబ్బందికి ఆమె మృతదేహం కనిపించింది. దీంతో గ్రామస్థులు అక్కడికి చేరుకుని అండర్‌పాస్ కారణంగా ఎదురవుతున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం అసిస్టెంట్ ఇంజనీర్ అజిత్‌కుమార్ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, గ్రామస్తులు, వాహనాల రాకపోకలకు వీలుగా ప్రత్యేక అండర్‌పాస్ నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలాస జీఆర్పీ ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కళ్యాణికి భర్తతో పాటు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు.