వివాహిత ఆత్మహత్య
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:15 AM
చిన్నకొల్లివలస ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన వివాహిత గొబ్బక లావణ్య(19) చీమల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
ఎల్.ఎన్.పేట, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): చిన్నకొల్లివలస ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన వివాహిత గొబ్బక లావణ్య(19) చీమల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ప్రసాదరావు, తల్లి పావని సరుబుజ్జిలి ఎస్‌ఐ బి. హైమావతి తెలిపిన వివరాల ప్రకారం... లావణ్య ఈ నెల 15వ తేదీన ఇంటివద్దనే చీమల మందు తాగింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. మృతురాలికి మూడునెలల క్రితం పలాసకు చెందిన వ్యక్తితో వివాహమైంది. వివాహమైన కొన్ని రోజుల తరువాత నుంచి ఆమె కన్నవారి ఇంటివద్దనే ఉంటోంది. మృతురాలి తండ్రి ప్రసాదరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హైమావతి తెలిపారు.