Share News

యువకుడిని కాపాడిన మెరైన్‌ పోలీసులు

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:21 AM

సోంపేట మండలం బారువ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాద వశాత్తు మునిగిపోతున్న ఓ యువకుడిని మెరైన్‌ పోలీసులు రక్షించారు.

యువకుడిని కాపాడిన మెరైన్‌ పోలీసులు
108 వాహనంలో యువకుడ్ని చికిత్స కోసం తరలిస్తున్న మెరైన్‌ పోలీసులు

  • సముద్ర స్నానానికి వెళ్లి..

  • ప్రమాదవశాత్తు మునిగిపోతుండగా..

సోంపేట/శ్రీకాకుళం క్రైం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): సోంపేట మండలం బారువ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాద వశాత్తు మునిగిపోతున్న ఓ యువకుడిని మెరైన్‌ పోలీసులు రక్షించారు. వివరాలిలా ఉన్నాయి.. సోంపేట పట్టణం గాంధీనగర్‌ వీధికి చెందిన ఆర్థి వాసుదేవ్‌ సోమవారం సముద్రంలో స్నానం చేశాడు. ఇదే సమయంలో ప్రమాదవశాత్తు మునిగి నీళ్లు తాగేస్తుండగా అక్కడే ఉన్న మెరైన్‌ సిబ్బంది అప్రమత్తమ య్యారు. సదరు యు వకుడిని ఒడ్డుకు చేర్చి 108 వాహనంలో హరిపురం పీహెచ్‌సీకి చికిత్స నిమిత్తం తరలించినట్లు సీఐ రమేష్‌ తెలిపారు. ఏఎస్‌ఐ కోదండరావు, హెచ్‌సీ ఉమామహేశ్వరరావు, సిబ్బంది సంగమేశ్వరరావు, హరిప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 12:21 AM