ప్రింటర్‌కు బదులు గోళీలు
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:02 AM
కొన్ని ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థలు కస్టమర్లను మోసం చేస్తున్నాయి.
- పార్సిల్‌లో పంపించిన వైనం
- ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ మోసం
పొందూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): కొన్ని ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థలు కస్టమర్లను మోసం చేస్తున్నాయి. బుక్ చేసుకున్న వస్తువుకు బదులు పార్సిల్‌లో రాళ్లు, పనికిమాలిన వస్తువులను పంపిస్తున్నాయి. ఇటువంటి ఘటనే పొందూరులో శుక్రవారం చోటుచేసుకుంది. పొందూరుకు చెందిన వ్యాపారవేత్త బి.ప్రతాప్‌కుమార్ నాలుగు రోజుల కిందట ఓ ఆన్‌లైన్ సంస్థలో క్విక్‌మార్క్ హేండ్ హోల్డ్ ఇంక్‌జెట్ కంపెనీకి చెందిన మినీ ప్రింటర్‌ను బుక్ చేశారు. ఆన్‌లైన్‌లోనే రూ.1,300 చెల్లించారు. శుక్రవారం డెలివరీబాయ్ వచ్చి పార్సిల్‌ను అందించి వెళ్లిపోయాడు. ప్రతాప్ పార్సిల్‌ను విప్పిచూడగా అందులో గోళీలు, గ్లౌజ్ ఉండడంతో కంగుతిన్నాడు. సంబంధిత ఆన్‌లైన్ సంస్థకు, డెలివరీ చేసిన కంపెనీకి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వస్తుంది. తాను ఓపెన్ చేసిన కంపెనీ లింక్ కూడా ఇప్పుడు కనిపించడం లేదని ప్రతాప్ అంటున్నాడు.