ముగిసిన మండల పరిషత్‌ల పాలనా కాలం
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:11 AM
మండల పరిషత్ పాలనాకాలం ముగియడంతో ప్రత్యేకాధి కారులు నియమించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
మండలాలకు ప్రత్యేకాధికారుల నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): మండల పరిషత్ పాలనాకాలం ముగియడంతో ప్రత్యేకాధి కారులు నియమించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జిల్లాలోని 30 మండలాలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డా.జి.నారాయణరావు (ఆమదాలవలస), బి.శైలజ (బూర్జ), డా.రఘునాథ్ (పొందూరు), డా.ఎ.ఆనందరావు (సరుబుజ్జిలి), వి.శ్రీని వాసరావు (రణస్థలం), ఆర్.శ్రీనివాసరావు (లావేరు), డా.బి.గణపతిరావు (ఎచ్చెర్ల), టి.రాజేంద్రప్రసాద్ బాబు (జి.సిగడాం), బి.లవరాజు (శ్రీకా కుళం), డా.పీఎస్‌జీ బాలకృష్ణ (గార) నియమితులయ్యారు. అలాగే వి. విశ్వేశ్వరరావు (పాతపట్నం), బి.రాజగోపాల్ (హిరమండలం), డా.సీ హెచ్ నరసింహులు (మెళియాపుట్టి), ఎం.అన్నాదొర (కొత్తూరు), టి. జనార్దనరావు (ఎల్‌ఎన్‌పేట) నియమితులయ్యారు. అలాగే సీహెచ్.శ్రీని వాసరెడ్డి (ఇచ్ఛాపురం), అజయ్ కార్తికేయ (సోంపేట), కె.అప్పలస్వామి (కంచిలి), సీహెచ్ చంద్రశేఖర్ (కవిటి), ఇ.అనూరాధ (నరసన్నపేట), పి.జయనాథ ప్రసాద్ (జలుమూరు), ఎల్‌వీ మధు (పోలాకి), డా.ఎం. లోకనాథం (సారవకోట)లను నియమించారు. అదేవిధంగా ఎం.కృష్ణ మూర్తి (టెక్కలి), కె.జగన్మోహన్ (కోటబొమ్మాళి), డి.గోపీకృష్ణ (సంతబొ మ్మాళి), ఎల్.అలివేలు మంగమ్మ (నందిగాం), డా.ఎం.రవికృష్ణ (పలా స), ఎం.రామారావు (మందస), డా.పి.చంద్రశేఖరరావు (వజ్రపుకొత్తూ రు) నియమితులయ్యారు. వీరంతా ఈనెల గురువారం (24) నుంచి బాధ్యతలు స్వీకరించి నివేదికలను కార్యాలయానికి అందజేయాలని ఆదే శించారు. వీరు ఆరు నెలల పాటు లేదా కొత్త పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించే వరకు విధులు నిర్వహిస్తారని తెలిపారు.