Share News

ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి మృతి

ABN , Publish Date - May 11 , 2026 | 12:15 AM

గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సారవకోట గ్రామానికి చెందిన బొల్లు తిరుపతిరావు (54) శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు.

ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి మృతి

జలుమూరు (సారవకోట), మే 10(ఆంధ్రజ్యోతి): గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సారవకోట గ్రామానికి చెందిన బొల్లు తిరుపతిరావు (54) శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుటుంబ కలహాల నేపథ్యంలో తిరుపతిరావు ఇంటిలో ఉన్న గడ్డిమందు శనివారం తాగి అస్వస్తకు గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో తొలుత నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. తిరుపతిరావు భార్య మాలతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌ తెలిపారు. తిరుపతిరావుకు పెళ్లైన కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Updated Date - May 11 , 2026 | 12:15 AM