Share News

తేనెటీగల దాడిలో వ్యక్తికి గాయాలు

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:33 AM

పోలవరం గ్రామానికి చెందిన కె.లచ్చయ్యపై తేనెటీగలు దాడిచేయడంతో గాయపడ్డాడు.

తేనెటీగల దాడిలో వ్యక్తికి గాయాలు
చికిత్స పొందుతున్న లచ్చయ్య

నందిగాం, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): పోలవరం గ్రామానికి చెందిన కె.లచ్చయ్యపై తేనెటీగలు దాడిచేయడంతో గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. శుక్ర వారం సాయంత్రం లచ్చయ్య తన మేకలను మేతకోసం పొలానికి తోలుకుని వెళ్లాడు. ఇదే సమయంలో సమీప ప్రాంతం నుంచి తేనె టీగలు మూకుమ్మడిగా వచ్చి లచ్చయ్యపై దాడి చేశాయి. స్థానికులు గుర్తించి 108 వాహనంలో టెక్కలిలో గల జిల్లా కేంద్రా సుపత్రికి తరలించారు.

Updated Date - Apr 04 , 2026 | 12:33 AM