Share News

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

ABN , Publish Date - May 28 , 2026 | 12:52 AM

బీజేపీ సీనియర్‌ కార్యకర్త, కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ధూపాన కామేశ్వరరావు రెడ్డి (65) విద్యుత్‌ షాక్‌తో బుధవారం మృతిచెందారు

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

టెక్కలి, మే 27 (ఆంధ్రజ్యోతి): బీజేపీ సీనియర్‌ కార్యకర్త, కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ధూపాన కామేశ్వరరావు రెడ్డి (65) విద్యుత్‌ షాక్‌తో బుధవారం మృతిచెందారు. స్థానిక పెద్దబ్రాహ్మణ వీధిలోని తన ఇంట్లోని దేవుడి గదిలో సీరియల్‌ లైట్లు అమర్చుతున్న క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై కుప్పకూలాడు. ఆయన కుమారుడు ధూపాన రాజకుమార్‌రెడ్డి తండ్రికి ఫోన్‌ చేస్తే స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూశారు. కామేశ్వరరావురెడ్డిని హుటాహుటిన జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కామేశ్వరరెడ్డి మృతిచెందారని వైద్యులు ధ్రువీకరించారు. రాజ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కామేశ్వరరెడ్డి మృతికి బీజేపీ మండలశాఖ అధ్యక్షులు రామ్‌జీ, నాయకులు నరేంద్ర, పరమేశు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - May 28 , 2026 | 12:52 AM