రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Sep 12 , 2026 | 10:58 PM
హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం కలియబల్లి గ్రామా నికి చెందిన మితన్ జగన్నాథ్ (56) అనే వ్యక్తి మృతి చెందాడు.
కోటబొమ్మాళి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం కలియబల్లి గ్రామా నికి చెందిన మితన్ జగన్నాథ్ (56) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. జగన్నాథ్ చంబల్‌పూర్‌లోని ఓ ప్రైవేటు కంపె నీలో ఫిట్టర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం పని మీద విశాఖపట్నం వెళ్తున్నానని ఇంటి వద్ద చెప్పి బయలు దేరాడు. శనివారం ఉదయం హరిశ్చంద్రపురం రైలు నిలయంలో డీఎంయూ రైలు దిగి ఫ్లైఓవర్‌పైకి ఎక్కి జాతీయ రహదారిని దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి తల్లి గంగమ్మ, భార్య జయంతిరెడ్డి, కుమార్తె ఢిల్లేశ్వరి ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వంగపండు సత్యనారాయణ తెలిపారు.
చికిత్స పొందుతూ లారీ క్లీనర్..
కోటబొమ్మాళి, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): వాండ్రాడ గ్రామానికి చెందిన లారీ క్లీనర్ గోరు రవికుమార్ (39) శ్రీకాకుళం ప్రభుత్వ అసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. రవికుమార్ ఈనెల 7న చిన్నబమ్మిడి వద్ద లారీపైన తాళ్లు కడుతూ ప్రమాదవశాత్తు కిందకు జారిపడి గాయడ్డాడు. డ్రైవర్ షేక్ సుత్తాన్ 108లో నరన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, రవికుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. రవికుమార్ తల్లి నరసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు.