Share News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:09 AM

కోటబొమ్మాళి మెయిన్‌రోడ్డు గాంధీ ఆసుపత్రి ఎదురుగా శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని మాసాహెబ్‌పేట గ్రామానికి చెందిన పులి లక్ష్మణ రావు (44) మృతి చెందాడు.

 రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
లక్ష్మణరావు మృతదేహం

కోటబొమ్మాళి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళి మెయిన్‌రోడ్డు గాంధీ ఆసుపత్రి ఎదురుగా శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని మాసాహెబ్‌పేట గ్రామానికి చెందిన పులి లక్ష్మణ రావు (44) మృతి చెందాడు. పోలీ సుల వివరాల మేరకు.. లక్ష్మణరా వు ఒడిశాలో జవహర్‌ నవోదయ స్కూల్‌ కన్వీనర్‌గా పని చేస్తున్నాడు. అతని భార్య కమల సంతబొమ్మాళి కేజీబీవీలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. వీరు కోటబొమ్మాళిలోని విద్యుత్‌ నగర్‌లో ఇల్లును అద్దెకు తీసుకొని ఉంటున్నారు. లక్ష్మణరావు శనివారం రాత్రి రైతుబజారు నుంచి నడుచుకొని ఇంటికి వస్తుండగా గాంధీ ఆసుపత్రి ఎదురుగా వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. గాయపడిన లక్ష్మణరావును 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ అసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య కమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వంగపండు లక్ష్మణరావు తెలిపారు. లక్ష్మణ రావుకు ఇద్దరు కుమారులు హేమసాయి, ప్రేమ్‌వినయసాయి ఉన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:09 AM