రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:28 AM
మండల కేంద్రం నంది గాం జాతీయ రహదారి స ర్వీసు రోడ్డు లో సోమవా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక రెల్లివీధికి చెందిన అడప చిన్నవాడు (55) దుర్మరణం చెందాడు.
నందిగాం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యో తి): మండల కేంద్రం నంది గాం జాతీయ రహదారి స ర్వీసు రోడ్డు లో సోమవా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక రెల్లివీధికి చెందిన అడప చిన్నవాడు (55) దుర్మరణం చెందాడు. స్థాని కులు తెలిపిన వివరాల మేరకు.. చిన్న వాడు స్థానిక బజారుకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లేం దుకు రోడ్డు దాటుతుం డగా శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వెళ్లే ఓ ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొంది. దీంతో చిన్నవాడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయ న నందిగాం చెత్త నుంచి సంపద త యారీ కేంద్రంలో గ్రీన్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు. చిన్నవాడుకు భార్య దాలమ్మ, కుమారులు రవణ, ఈశ్వర రావు, శంకర్ ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.