Share News

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:08 AM

మెట్టూరు గ్రామానికి చెందిన మండూరి ప్ర కాశరావు(55) విద్యుత్తు షాక్‌కు గురై మృ తి చెందినట్టు హెచ్‌సీ తిరుపతిరావు తెలి పారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

కొత్తూరు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): మెట్టూరు గ్రామానికి చెందిన మండూరి ప్ర కాశరావు(55) విద్యుత్తు షాక్‌కు గురై మృ తి చెందినట్టు హెచ్‌సీ తిరుపతిరావు తెలి పారు. హెచ్‌సీ తెలిపిన వివరాల మేరకు.. ఉప్పరపేట గ్రామంలో శుక్రవారం మొగిలి ఝాన్సీ ఇంట్లో వైరింగ్‌ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైర్లు తగిలి ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స కోసం కొత్తూరు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారిం చారు. ప్రకాశరావు ఎలక్ట్రీషియన్‌గా పనులు చేస్తూ కుటంబాన్ని పోషించు కుంటున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, కుమారుడు ఉన్నారు. భార్య జానకి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు హెచ్‌సీ తెలిపారు.

రైలు ఢీకొని ఉపాధ్యాయుడికి గాయాలు

పాతపట్నం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): స్థానిక కాకితోట చేరువలో రైలు ఢీకొని మాలువ సింహాచలం అనే ఉపాధ్యాయుడి కాలు తెగిపడిన ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే స్థానిక బాలాజీనగర్‌కు చెందిన మాలువ సింహాచలం మండల పరిధి స్టువర్టుపేటలో ఉపాధ్యాయుడిగా పనిచే స్తున్నారు. అనారోగ్య కారణంగా ప్రస్తుతం సెలవులో ఉన్నారు. శుక్రవారం సా యంత్రం బయటకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో కాకితోట సమీపంలో గుణుపూర్‌ నుంచి రూర్కెలా వెళ్తున్న రైలు ఢీకొనడంతో ఎడమకాలు తెగి పడిపోయింది. స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం సింహాచలాన్ని పాతప ట్నం సీహెచ్‌సీకు తరలించి వైద్యసేవలు అందించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

గంజాయితో వ్యక్తి అరెస్టు

ఆమదాలవలస, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌ బుకింగ్‌కౌంటర్‌ వద్ద శుక్రవారం గంజాయితో ఓ వ్యక్తి పట్టుబడినట్టు ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. పోలీస్‌ సిబ్బందితో కలిసి రైల్వేస్టేషన్‌ బుకింగ్‌ కౌంటర్‌ వద్ద ఉన్న ఒడిశా రాష్ర్టానికి చెందిన చెందాను సురేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌ 3.260 కేజీల గంజాయితో తరలిస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సురేష్‌తో పాటు ఆయనకు గంజాయి విక్రయించిన ఒడిశాలోని రాయగడకు చెందిన సిబా మిస్సాల్‌ పై కేసు నమోదుచేశారు. పట్టుబడిన గంజాయిను సీజ్‌ చేశారు. సురేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Feb 07 , 2026 | 12:08 AM