వంశధార రిజర్వాయర్ గెడ్డలోపడి వ్యక్తి మృతి
ABN , Publish Date - May 09 , 2026 | 12:40 AM
హిర మండలం వద్ద వంశ ధార రిజర్వాయర్ గెడ్డ లో పడి ఒకరు మృతి చెందిన ఘటన బుధ వారం చోటు చేసుకుం ది.
హిరమండలం, మే 8(ఆంధ్రజ్యోతి): హిర మండలం వద్ద వంశ ధార రిజర్వాయర్ గెడ్డ లో పడి ఒకరు మృతి చెందిన ఘటన బుధ వారం చోటు చేసుకుం ది. ఎస్‌ఐ మధుసూదన రావు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం నవరంగపూర్ జిల్లా సిరిగిగూడ గ్రామానికి చెందిన పురునోభత్ర ఇదే మండలం పెద్దసంకిలి గ్రామానికి చెందిన పల్ల శ్రీనివాస్ వద్ద బోర్‌వెల్ పనుల్లో కూలీగా పనిచేస్తున్నాడు. ఇతను కొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 7న తన తోటి పనివారైన సురుభత్ర, మహేష్ భత్ర, సతీష్‌ఘడ్‌తో కలిసి పెద్దసంకిలి గ్రామం సమీపంలో వంశధార రిజర్వాయర్‌కు నీరు వచ్చే గెడ్డకు చేపలు పట్టేందుకు వెళ్లారు. ఆ సమయంలో పురునోభత్ర మద్యం మత్తులో ఉన్నాడు. దీంతో అతడు గెడ్డవద్దే నిద్రపోయాడు. మిగతా ముగ్గురు కాసేపు చేపల పట్టేందుకు ప్రత్నించి.. తిరిగి ఇంటికి వెళ్లి పో యేందుకు బయలు దేరారు. ఆ సమయంలో పురునోభత్ర ఒడ్డున లేక పోయేసరికి రూమ్‌కి వెళ్లిపోయి ఉంటాడని భావించి.. వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని పురునోభత్ర తమ్ముడు త్రిలోచన భత్రకు ఫోన్ చేసి తెలియజేశారు. తాగి ఎక్కడో పడిపోయి ఉంటాని వెతకమని త్రిలోచన భత్ర వారికి చెప్పాడు. గురువారం కూడా పురునోభత్ర రూమ్‌కి రాకపోవడంతో గెడ్డ వద్దకు వెళ్లి చూశా రు. గెడ్డనీటిలో దిగి వెతుకగా పురునోభత్ర నీటిలో మునిగి మృతిచెంది ఉన్నాడు. మద్యం మత్తులో నీటిలో మునిగి చెనిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు. మృతిని తమ్ముడు త్రిలోచన భత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు.
రైలు నుంచి జారిపడి యువకుడి...
ఆమదాలవలస, మే 8(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస రైల్వేస్టేషన్) సమీపంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజేంద్ర పొలై (40) శుక్రవారం గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి మృతి చెందినట్టు జీఆర్పీ ఎస్‌ఐ ఎస్.మధుసూదనరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా హతిగూడ ప్రాంతానికి చెందిన రాజేంద్ర పొలై బరంపురం నుంచి అన్నవరం వరకు రైలులో ప్రయాణిస్తున్నట్లు అతని వద్ద ఉన్న రైల్వే టికెట్ ద్వారా తెలిసిందన్నారు. జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న అతడు గుర్తు తెలియని రైలు నుంచి రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే ఇనిస్టిట్యూట్ వద్ద జారిపడి మృతి చెందినట్టు గుర్తించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కి తరలించినట్లు తెలిపారు.