చెరువులోపడి వ్యక్తి మృతి
ABN , Publish Date - May 12 , 2026 | 12:50 AM
స్కాట్‌పేట గ్రామానికి చెందిన మాసపు వెంకటరమణ(56) గ్రామ సమీపంలోని చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ పడిపోయి మృతిచెందాడు.
ఎల్‌ఎన్ పేట, మే 11(ఆంధ్రజ్యోతి): స్కాట్‌పేట గ్రామానికి చెందిన మాసపు వెంకటరమణ(56) గ్రామ సమీపంలోని చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ పడిపోయి మృతిచెందాడు. గ్రామ స్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేర కు.. వెంకటరమణ రోజూలాగే సోమవారం సాయం త్రం గ్రామ సమీపంలోని చెరువుకు స్నానానికి వెళ్లా డు. ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య సులోచన ఆందోళనచెంది గ్రామస్థులకు చెప్పింది. దీంతో కొంతమంది చెరువులో గాలించగా మృతదేహం లభించింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా వెంకటరమణకు భార్య సులోచన, వివాహమైన కుమార్తె పద్మ ఉన్నారు. కుమార్తె పద్మకు వివాహ మైంది. సులోచన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్‌కానిస్టేబుల్ రమేష్ తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
జలుమూరు, మే 11(ఆంధ్రజ్యోతి): వెంకటాపురం పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన వరుదు పాపారావు (56) శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాపారావు గత 20 ఏళ్లుగా నెల్లూరు జిల్లా కావలిలో కూలి పనులు చేసుకుంటూ కుటుంబంతో జీవిస్తున్నాడు. గ్రామంలో ఈ నెల 8న జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబంతో వచ్చాడు. అప్పటి నుంచి పాపారావు మద్యం తాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఇంటివద్ద ఉన్న గడ్డిమందును పాపారావు ఆదివారం తాగేసి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించాడు. కాగా పాపారావుకి భార్య ఉమ, ఇద్దరు కుమారులు సింహాచలం, లక్ష్మణరావు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి.అశోక్‌బాబు తెలిపారు.
రైలు నుంచి జారిపడి ఒకరు..
సంతబొమ్మాళి, మే 11(ఆంధ్రజ్యోతి): దండుగోపాలపురం రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి సోమవారం మృతి చెందారు. గౌహతి నుంచి బెంగుళూరు వెళ్లే సూపర్ ఫాస్ట్ రైలు నుంచి జరిపడి నట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడు అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పలాస రైల్వే పోలీసులు తెలిపారు.