చెట్టు పైనుంచి జారిపడి వ్యక్తి మృతి
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:01 AM
లోలుగు గ్రామానికి చెందిన లొట్టి నీలప్పడు(50) ప్రమాదవ శాత్తు కొబ్బరి చెట్టుపై నుంచి జారిపడి మృతిచెందాడు.
పొందూరు, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): లోలుగు గ్రామానికి చెందిన లొట్టి నీలప్పడు(50) ప్రమాదవ శాత్తు కొబ్బరి చెట్టుపై నుంచి జారిపడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం సాయంత్రం కొబ్బరి బొండాలు దించేందుకు చెట్టుపైకి ఎక్కాడు. ఆ తరువాత ఒక్కసారిగా జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృత దేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి రామప్పడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం తెలిపారు.